Oct 13,2023 15:32

జార్ఖండ్‌: జార్ఖండ్‌ మీదుగా ఢిల్లీకి వెళ్తున్న సీల్దా రాజధాని ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఓ వ్యక్తి కాల్పులకు పాల్పడ్డారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్‌ రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కిన హర్విందర్‌ సింగ్‌ (41) అనే వ్యక్తి.. కోచ్‌ అటెండెంట్‌తో గొడవకు దిగాడు. గొడవ పెద్దగా అవ్వడంతో తన దగ్గరున్న తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. రైల్వే పోలీసులు నిందితుడిని పట్టుకుని అరెస్ట్‌ చేశారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.