Jun 17,2023 11:52

ప్రజాశక్తి-మంత్రాలయం (కర్నూలు) : మండల పరిధిలోని రచ్చమర్రి గ్రామానికి చెందిన సుంకేశ్వరి ముక్కరన్న కు చెందిన గడ్డి వాములు దగ్ధమై రైతుకు నష్టం జరిగిన నేపథ్యంలో ... వైసిపి రాష్ట్ర యువ నేత వై.ప్రదీప్‌ రెడ్డి 20 వేల రూపాయల ఆర్థిక సహాయంను శనివారం అందజేశారు. గత వారం రోజుల క్రితం ఈదురుగాలులకు విద్యుత్‌ తీగలు తెగిపడి మంటలు చెలరేగి గడ్డి వాములు దగ్ధమైన విషయం అందరికీ తెలిసిందే. ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు యువనేత చేయూత అందించారు. శనివారం ఎమ్మిగనూరు పట్టణంలోని భీమా నిలయంలో గ్రామ నాయకులతో కలిసి నగదును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్‌ ఎంపిపి వెంకోబా, నాయకులు రోగప్ప, రవి రెడ్డి, బజ్జప్ప, నారయణ, డీలర్‌ బొజ్జప్ప, వీరన్న గౌడ్‌, నరసప్ప తదితరులు పాల్గొన్నారు.