
ప్రజాశక్తి-నందిగామ (ఎన్‌టిఆర్) : మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టిడిపి ఆధ్వర్యంలో శనివారం నందిగామ ఆర్డిఓ కార్యాలయం వద్ద రైతులు ధర్నా చేశారు. నందిగామ, జగ్గయ్యపేట మాజీ ఎంఎల్‌ఎలు తంగిరాల సౌమ్య,శ్రీ రాం రాజగోపాల్ పాల్గొని నందిగామ ఆర్డిఓ రవీంద్రరావుకు వినతిపత్రం అందజేశారు. మాజీ ఎంఎల్‌ఎలు మాట్లాడుతూ ... ధాన్యం కొనుగోలు లో వైసిపి నాయకులు జోక్యం లేకుండా చూడాలన్నారు. గోనె సంచులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుకు తరుగు లేకుండా చూడాలన్నారు. ఆర్డిఓ రవీంద్రరావు మాట్లాడుతూ ... ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరగకుండా చూస్తామని హమీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నందిగామ మండల అధ్యక్షులు వీరంకి వీరాస్వామి, తెలుగు యువత నందిగామ మండల అధ్యక్షులు తోట నాగమల్లేశ్వరరావు, మనబోతుల శ్రీరామ, కొంగర నరేంద్ర, రాము, లక్ష్మీ నారాయణ, వేల్పుల బిక్షాలు, బందలపాటి రామకఅష్ణ, మాజీ ఎంపిపి మన్నే కళావతి, కోటేశ్వరమ్మ, కొంగర నరేంద్ర, అమ్మినేని జ్వాలా, గురు ప్రసాద్, నెలకుదిటి నాగేశ్వరరావు, పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.