Jun 16,2022 06:28

విత్తనాలు, నారుమళ్లు లేకుండా ముందుగానే సాగునీరు విడుదల చేసి అదేదో పెద్ద ఘనకార్యంగా అమాత్యులు భావిస్తున్నారు! అయితే గత సంవత్సరం కురిసిన అధిక వర్షాలకు, వరదలకు సాగునీటి వ్యవస్థ పూర్తిగా దెబ్బ తింది. నిజానికి గత మూడు సంవత్సరాలుగా పెద్ద పెద్ద జలాశయాలు మొదలుకొని పంట కాలువలు వరకు ఎటువంటి మరమ్మతులకు నోచుకోక శిధిలావస్థకు చేరుకున్నాయి. ముఖ్యంగా డెల్టాలో కాలువల లాకులు, షట్టర్లు తుప్పు పట్టి పని చేయడం లేదు. డ్రెయిన్లు, కాలువలు వ్యర్ధ పదార్ధాలతో నిండిపోయి పంట పొలాలకు సాగునీరు పారే పరిస్థితి లేదు. కొద్దిపాటి వర్షానికే మురుగు ఎగదన్ని పొలాలు మునకేస్తున్నాయి. పాలకుల ఆర్భాటపు ప్రకటనలు తప్పిస్తే క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి ఏమిటో విచారణ చేయడం లేదు. ఇప్పుడు వర్షాలు మొహం చాటేస్తే ఉన్న కాస్త నీరు వృధా! పొలాలు బెట్టకు వచ్చి, రైతులు తీవ్రంగా నష్టపోతారు. రైతు సంఘాలు, సాగు నీటి సంఘాల వారి సలహాలు, సూచనలు పెడచెవిన పెట్టి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం రైతులను మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది!

- జి.రామకృష్ణ, ముస్తాబాద,
కృష్ణా జిల్లా.