
వంకాయ కూరంటే చాలామందికి ఇష్టం. గుత్తొంకాయ కూర మీద ఏకంగా బోలెడు పాటలు ఉన్నాయి. రుచికి మాత్రమే కాదు, వంకాయలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు కూడా కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
- వంకాయల్లో విటమిన్ కె, విటమిన్ బి6, పొటాషియం, మాంగనీస్, ఫోలేట్, ఫైబర్ వంటి పోషకాలు ఉన్నాయి.
- వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి..
- వంకాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్‌ను నశింపజేసి క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి.
- వంకాయలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. సులువుగా బరువు తగ్గవచ్చు.
- వంకాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల కంటి సమస్యలు తగ్గడంతో పాటు కంటి చూపు మెరుగుపడుతుంది.
- ఎముకలు ధృడంగా తయారవుతాయి. ఎముకల సాంద్రత పెరుగుతుంది.
- చర్మాన్ని, జుట్టును, గోళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా వంకాయలు సహాయపడతాయి.
- వంకాయలోని ఫోలేట్, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ3, బీ6, బీటా కేరోటిన్, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు గుండెపోటు, స్ట్రోక్ ముప్పును తగ్గిస్తాయి.
- వంకాయలో కరిగే పైబర్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల తినగానే కడుపు నిండినట్లు ఉంటుంది.