టోక్యో : జపాన్‌లో శుక్రవారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.0గా నమోదైందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (జిఎఫ్‌జెడ్) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. శుక్రవారం తెల్లవారుజామున 5.44 గంటల సమయంలో జపాన్‌లోని హక్కైడో ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు జిఎఫ్‌జెడ్ పేర్కొంది. 46 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించిందని, అయితే ప్రాణ నష్టం సంభవించలేదని జిఎఫ్‌జెడ్ తెలిపింది. ఈ భూకంపం వల్ల జరిగిన ఆస్తి నష్టానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని జిఎఫ్‌జెడ్ పేర్కొంది.