Oct 28,2023 12:20

నైపిడావ్‌ (మయన్మార్‌) : మయన్మార్‌లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.5గా నమోదైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ (ఎన్‌సిఎస్‌) వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. మయన్మార్‌లో శనివారం ఉదయం 4.53 గంటల సమయంలో భూప్రకంపనలు సంభవించినట్లు ఎన్‌సిఎస్‌ ఎక్స్‌లో పోస్టు చేసింది. ఎత్తు 26.36, పొడవు 95.41, లోతు : 30 కిలోమీటర్లు.. భూమి కంపించినట్లు ఎన్‌సిఎస్‌ వెల్లడించింది. ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు తెలియలేదని ఎన్‌సిఎస్‌ పేర్కొంది.