Apr 16,2023 15:20

తిరుపతి :టీటీడీ వ్యవహారాలను పర్యవేక్షించే తిరుమల తిరుపతి దేవస్థాన ట్రస్టుకు శనివారం హైదరాబాద్‌కు చెందిన ఓ యాత్రికుడు కోటి రూపాయల విరాళం అందించారు. సదరు యాత్రికుడి కోటి రూపాయల విరాళం అందిందని టీటీడీ వర్గాలు తెలిపాయి. ఎస్సార్సీ ఇన్‌ఫ్రా ప్రయివేట్‌ లిమిటెడ్‌ తరఫున ఏవీకే ప్రసాద్‌, ఏవీ ఆంజనేయప్రసాద్‌ శనివారం తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిని కలిసి డిమాండ్‌ డ్రాఫ్ట్‌ రూపంలో విరాళాన్ని అందజేశారు. ఆ తరుణంలో ఈ విరాళ నిధులను శ్రీవేంకటేశ్వర ప్రాణదానం ట్రస్ట్‌ సంబంధిత కార్యక్రమాలకు వినియోగించాలని యాత్రికులు టీటీడీ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు.