ప్రజాశక్తి-రాజంపేటఅర్బన్(అన్నమయ్యజిల్లా) : ఈనెల 20వ తేదీన నిర్వహించనున్న బలిజ పల్లె గంగమ్మ జాతర మహోత్సవానికి రాజంపేట యువ నాయకుడు మేడా విజయ శేఖర్ రెడ్డి (మేడా పెద్ద బాబు) మంగళవారం జాతర కమిటీ సభ్యులకు రూ.లక్ష విరాళం అందజేశారు. ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు మంగళవారం మేడా పెద్ద బాబును ఆయన స్వగృహంలో కలిసి శాలువాతో ఘనంగా సన్మానించి జాతర ఆహ్వాన పత్రికను అందజేశారు. జాతర నిర్వహణకు తన వంతు విరాళంగా రూ లక్ష అందజేశారు. ఈ సందర్భంగా విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ జాతరలు, తిరునాళ్లు సంస్కతి సంప్రదాయాలను ప్రతిబింబింపజేస్తాయని అన్నారు. ఇటువంటి కార్యక్రమాలకు తన వంతు సహాయం అందించగలగడం తన భాగ్యమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బలిజ పల్లె ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.










