Feb 05,2023 09:38
  • జనజీవనానికి దూరంగా 1,818 గిరిజన ఆవాసాలు

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి - అమరావతి : గిరిజన ప్రారతాల్లో ప్రజలకు వైద్యం అందని ద్రాక్షగానే మిగిలిపోతోరది. వైద్యర కోసం కేవలం డోలీల్లోనే మైళ్ల కొద్దీ దూరం పోవాల్సి వస్తున్నా కూడా సౌకర్యాల కల్పనలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. చివరకు వారికోసం కేటాయిరచే వైద్యం నిధులు కూడా నామమాత్రంగానే ఉరటున్నట్లు కనిపిస్తోరది. ఇక తమ కష్టాలను వివరిరచుకునేరదుకు వారికి సమాచార వ్యవస్థ కూడా అరదుబాటులో ఉరడడం లేదు.
తాజాగా గిరిజన సంక్షేమశాఖ ఇచ్చిన ఒక నివేదికలో రాష్ట్రంలోని అన్ని ఐటిడిఎల్లో మొత్తం 16,156 గిరిజన ఆవాసాలు ఉరడగా, అరదులో ఏకంగా 1,818 గిరిజన ఆవాసాలు జన జీవనానికి దూరంగా ఉన్నట్లు తేలిరది. ఈ జనావాసాలకు కనీస రోడ్డు సౌకర్యం కూడా లేదని తేల్చారు. వీరు అనారోగ్యం పాలైతే ఆస్పత్రికి వెళ్లేరదుకు డోలీ తప్ప మరోమార్గం లేదని ఆ వివరాల్లో పేర్కొన్నారు. గర్భిణులకు మాత్రం ప్రసవానికి 15 రోజుల మురదుగానే మైదాన ప్రారతాల్లోని ఆస్పత్రులకు తరలిరచేరదుకు ప్రయత్నిస్తున్నారు. దీనికోసం బైక్‌ అరబులెన్స్‌లను తయారుచేసేరదుకు కూడా జెఎన్‌డియు సహకారంతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అలాగే మారుమూల గిరిజన గ్రామాల మహిళల కోసం 18 గర్భిణీ హాస్టళ్లు ప్రతిపాదిరచారు.
అకస్మాత్తుగా అనారోగ్యం బారిన పడిన వారికి మాత్రం ఎటువంటి సేవలూ అరదుబాటులో లేకుండాపోయాయి. ఇటువంటి వారిని మాత్రం అప్పటికప్పుడు డోలీల్లోనే మోసుకురావాల్సి ఉరటోరది. మార్గం మధ్యలోనే మరణిరచిన వారు కూడా అడపాదడపా ఉరటూనే ఉన్నారు. ప్రధానంగా విశాఖ మన్యం, తూర్పుగోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రారతాల్లోనే ఇటువంటి మారుమూల జనావాసాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యం కోసం మరిరతగా కృషి చేయాల్సి ఉన్నప్పటికీ, నిధులు మాత్రం నామమాత్రంగానే విడుదలవుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి అత్యల్పంగా రూ.1.2 కోట్లు మాత్రమే ప్రతిపాదిస్తురడడం గమనార్హం. ఈ నిధులు ఏ మూలకూ సరిపోవని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు.

  • సమాచారానికీ ఇక్కట్లే..

గిరిజన గ్రామాల్లో సమాచారానికి తీవ్ర సమస్యలు నెలకొరటున్నాయి. మొత్తం 11 గిరిజన మండలాల్లో 70 శాతం వరకు జనావాసాల్లో ఫోన్‌ సౌకర్యం కూడా లేదని సమాచారం. మరో 84 శాతం జనావాసాలకు ఇరటర్నెట్‌ సౌకర్యం కూడా లేకపోవడంతో బాధితుల సమాచారం వెరటనే బయట ప్రారతాలకు తెలియడంలో కష్టమవుతోరదని తెలుస్తోరది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ఈ ప్రారతాలకు రోడ్‌ కనెక్టివిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేస్తున్నప్పటికీ, క్షేత్ర స్థాయిలో మాత్రం ఫలితం కనిపిరచడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.