జయం రవి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'ఇరైవన్'. ఇదే చిత్రాన్ని తెలుగులో 'గాడ్' పేరుతో విడుదల చేయనున్నారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా జయం రవి ఓ ఇంటర్వ్యూలో... తమ చిత్రానికి సెన్సార్ బోర్డ్ 'ఏ' సర్టిఫికేట్ ఇవ్వడంపై మాట్లాడారు. 'అన్ని వయసుల ప్రేక్షకులకు వినోదాన్ని అందించేలా నేను తరచూ సినిమాలు చేస్తుంటా. ఈ చిత్రాన్ని మాత్రం పిల్లలతో కలిసి చూడొద్దు. ఎందుకంటే, ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలకు పిల్లలు భయపడే ప్రమాదం ఉంది. ఇలాంటి జోనర్ చిత్రాలను కొంతమంది ఇష్టపడతారు. వాళ్లు తప్పకుండా సపోర్ట్ చేస్తారనుకుంటున్నా' అని చెప్పారు.










