తెలుగు భాషను బోధించే టీచర్లను తొలగించొద్దు : మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి
పాడేరు (అల్లూరి సీతారామరాజు) : అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు మండల కేంద్రంలో శనివారం మాజీ మంత్రి మత్స్యరాస మణి కుమారి మాట్లాడుతూ ... తెలుగు బాషను భవిష్యత్తు తరాలకు తెలియజేయాల్చిన ప్రభుత్వమే కక్షపూరితంగా వ్యవరించడం సిగ్గు చేటు అని అన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలల్లో విద్యను బోధించే టీచర్స్ ని నామమాత్రంగా నియమించి వాళ్ళను కూడ తొలిగించే కుట్ర జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తుందని ఆరోపించారు. అందులో తెలుగు బాషా బోధించే తెలుగు టీచర్స్ నే టార్గెట్ చేసున్నట్ల జగన్ ప్రభుత్వం వ్యహర శైలి ఉంది అన్నారు. 2018-19 సంవత్సరానికి ముందు కె.జి.బి.వి లల్లో 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకే ఉండేదని, 2019 సంవత్సరంలో ఇంటర్మీడియట్ ప్రారంభించిన్నప్పటికి పూర్తి స్థాయిలో టీచర్స్ ని నియమించకపోగా ప్రభుత్వం ఉన్న టీచర్స్ ని కూడా తొలిగించాలని చూస్తుందన్నారు. కొన్ని కేజీబివి లల్లో టీచర్స్ కొరత ఉంది అనీ, అలాంటి స్కూల్స్, కి కాలేజీలకి టీచర్స్ ని నియమించాల్సిందిపోయి ఉన్న టీచర్స్ ని కూడా తొలిగించడమేంటీ అని ప్రశ్నించారు. తెలుగు బాషను బోధించే టీచర్స్ ని తొలిగించే నిర్ణయం వెనక్కు తీసుకోవాలని లేకపోతే ఉపాధ్యాయుల పక్షాన పోరాటం చేస్తాం అని తెలిపారు.










