Sep 24,2022 11:18

విజయవాడ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం చేపట్టిన ' దేశ రక్షణ భేరి ' బహిరంగ సభ శనివారం ఉదయం 11 గంటలకు విజయవాడ జింఖానా మైదానంలో ప్రారంభమైంది. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు. సభ జరిగే జింఖానా మైదానంలో వేదికతోపాటు దాని పరిసర ప్రాంతాలన్నీ ఎర్ర జెండాలతో ఎరుపెక్కాయి. వేదికపై 100 మంది ప్రజా నాట్యమండలి కళాకారులు వివిధ కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. వేలాదిగా తరలివచ్చే ప్రజల దాహార్తిని తీర్చేందుకు మజ్జిగ, మంచినీళ్ళు ఏర్పాటు చేశారు. ఎన్‌టిఆర్‌, కృష్ణా జిల్లా, గుంటూరు, పల్నాడు, ఏలూరు, భీమవరం, తదితర జిల్లాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో జింఖానా మైదానానికి చేరుకుంటున్నారు.

 </p>