Jul 27,2023 15:30

తిరుమల : భారీ వర్షాల కారణంగా తిరుమలకు యాత్రికుల రద్దీ తగ్గింది. గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న రాష్ట్రాల్లోను వర్షాలు పడుతుండడంతో యాత్రికులు తిరుమల రాకను విరమించుకుంటుండడంతో రద్దీ సాధారణంగా ఉంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యాత్రికులు 6 కంపార్ట్‌మెంట్లలో దర్శనానికి వేచి యున్నారు.బుధవారం స్వామివారిని 74, 268 మంది దర్శించుకోగా 26,817 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. యాత్రికులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.32 కోట్లు వచ్చిందని అధికారులు వివరించారు. టోకెన్లు లేని యాత్రికులకు 12 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని వెల్లడించారు.