- సింగపూర్ ఉపగ్రహంతో పాటు ఆరు నానో ఉపగ్రహాలు
- కౌంట్‌డౌన్ ప్రారంభం
ప్రజాశక్తి - సూళ్లూరుపేట :తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఇస్రో మరో వాణిజ్య రాకెట్ ప్రయోగానికి సిద్ధమైంది. ఆదివారం ఉదయం 6:31 గంటలకు మొదటి ప్రయోగ వేదిక నుంచి పిఎస్‌ఎల్‌వి సి-56 (పోలార్ సాటిలైట్ లాంచ్ వెహికల్) రాకెట్ ద్వారా సింగపూర్‌కు చెందిన డిఎస్-సార్ అనే ఉపగ్రహంతో పాటు మరో ఆరు నానో ఉపగ్రహాలను ప్రయోగించడానికి ఇస్రో అన్ని ఏర్పాట్లూ సిద్ధం చేసింది. సింగపూర్‌కు చెందిన వివిధ ప్రయివేటు కంపెనీలకు సంబంధించిన నానో ఉపగ్రహాలలో వేలోక్స-ఎఎం, ఆర్కేడ్, స్కూబీ, న్యూ లైన్, గాలాసియా-2, ఓఆర్‌బి-12, స్త్రీడర్ ఉపగ్రహాలు ఉన్నాయి. పిఎస్‌ఎల్‌వి సిరీస్‌లో ఇది 58వ ప్రయోగం. ఇప్పటి వరకూ 92 రాకెట్లను, 34 దేశాలకు చెందిన 424 ఉపగ్రహాలను వాణిజ్య పరంగా ప్రయోగించింది. కౌంట్‌డౌన్‌ను శనివారం ఉదయం 5.10 నిమిషాలకు ప్రారంభమై ఆదివారం ఉదయం 6.31నిమిషాలకు రాకెట్ ప్రయోగం జరగనుంది.










