Oct 02,2023 19:50

'దేశ ప్రజలకు ఈరోజు ఎంతో ముఖ్యమైనది. నేను చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ ప్రారంభించిన నాటి క్షణాలను గుర్తు చేసుకుంటున్నా. పాతిక వసంతాల అద్భుÛతమైన ప్రయాణం ఇది. ఇప్పటివరకూ 10 లక్షల బ్లడ్‌ యూనిట్లను సేకరించి అవసరమైన వారికి అందజేశాం. 10 వేల మందికి కంటి చూపునిచ్చాం. కరోనా సమయంలో వేల మందికి సాయం అందించాం. తోటి మానవాళికి సాయం చేయడం వల్ల వచ్చే సంతృప్తిని మాటల్లో చెప్పలేం. చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌ వేదికగా ఎన్నో సేవ కార్యక్రమాల్లో తమ వంతు సాయం అందిస్తున్న అక్కా చెల్లెళ్లు, సోదరులు, అభిమానులకు సెల్యూట్‌ చేస్తున్నా. మన దేశానికి మనం చేస్తున్న చిరు సాయమిది' అంటూ చిరంజీవి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. సాధారణ నటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన చిరంజీవి తను ఎదిగిన క్రమంలో తోటివారికి తన వంతు సాయం చేయాలనే గొప్ప సంకల్పంతో 1998 అక్టోబర్‌ 2 'చిరంజీవి ఛారిటబుల్‌ ట్రస్ట్‌'ను ప్రారంభించిన విషయం తెలిసిందే. 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా 'సాయం చేస్తే వచ్చే సంతృప్తిని మాటల్లో చెప్పలేం' అంటూ పోస్ట్‌చేశారు.