May 15,2023 12:47

ప్రజాశక్తి- పెద్దకడమూరు (కర్నూలు) : పెద్దకడబూరు మండల పరిధిలోని చిన్న తుంబలం గ్రామంలో ఉపాధి కూలీల పని ప్రదేశంలో వ్యవసాయ కార్మిక ఆధ్వర్యంలో సోమవారం సమావేశం నిర్వహించారు. కూలీల పనితీరు, వారికి రావలసిన పని వేతనాల గురించి అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఈడిగతిక్కన్న, రైతు సంఘం అధ్యక్షుడు పరమేష్‌, సిఐటియు ఈరన్న, హనుమంతు కలిసి ఉపాధి కూలీల వేతనాల గురించి అడిగి తెలుసుకున్నారు ఐదు వారాల నుండి ఈశ్వరమ్మకు 1022 జాబు కార్డు ఉంది కానీ ఈమె పని ప్రదేశంలో చేయి విరిగిపోయింది ఇంతవరకూ ప్రభుత్వం ఆమెకు ఎలాంటి సాయాన్ని అందించలేదని తోటి కూలీలు తెలిపి ఆవేదన వ్యక్తం చేశారు. ఇందిరమ్మకు ఎన్ని వారాలు పనిచేసిన ఒక్క రూపాయి వేతనం కూడా ఇవ్వలేదని తెలిపారు. అడుగుతున్నా.. రేపు.. ఎల్లుండు అంటూ మాటదాటేస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం ఉపాధి కూలీలకు నీటి వసతి కూడా కల్పించడం లేదనీ, మెడికల్‌ కిట్లను కల్పించడం లేదని కూలీలు వాపోయారు. 200 రోజులు పని కల్పించాలని అలాగే 600 రూపాయలు రోజుకి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పాత పద్ధతిలోనే పని కల్పించాలని కోరారు. పని ప్రదేశంలో చనిపోయిన కూలీకి వెంటనే ప్రభుత్వం పది లక్షల రూపాయల వరకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి కూలీలు పని ప్రదేశానికి వెళ్లడానికి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంటుంది తిరిగి రావడానికి నాలుగు కిలోమీటర్ల దూరం ఉంది మొత్తం ఎనిమిది కిలోమీటర్లు రవాణాచార్జి ఇవ్వాలని కోరారు. గడ్డపార కట్టిన కూలి తక్షణమే మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధి కూలీల సమస్యలపై ఈనెల 22న కలెక్టరేట్‌ ముట్టడి ఉంటుందని అందరూ అందులో పాల్గని జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఈడిగ తిక్కన్న గౌడ్‌, పరమేష్‌, హనుమంతు, ఈరన్న, తదితరులు పిలుపునిచ్చారు.