Jul 20,2023 12:13

ప్రజాశక్తి-పాడేరు: అల్లూరి జిల్లాలో వరద ఉధృతి నేపథ్యంలో ముంపు మండలాలైన చింతూరు, కూనవరం, విఆర్‌ పురం, ఎటపాక మండలాల ఫరిధిలో గల పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాలకు గురువారం జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ అత్యవసర సెలవు ప్రకటించారు. మూడు రోజులుగా అల్లూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నందున గోదావరి ఉద్ధృతి పెరుగుతున్న సంగతి విధితమే. ఈ వరదల నేపథ్యంలో రానున్న రెండు రోజులు అత్యంత కీలకమని దీని దృష్ట్యా ఈ మండలాల పరిధిలోని ప్రజలు అనవసర రాకపోకలు చేయరాదని విజ్ఞప్తి చేశారు. రేషన్‌ సరుకులు పంపిణీకి ఆదేశాలిచ్చారు.