
- గవర్నర్, సిఎం శుభాకాంక్షలు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : క్రిస్మస్ సందర్భంగా ప్రజలకు రాష్ట్ర గవర్నరు విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు ప్రభృతులు వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలియజేశారు. సద్గుణం, విశ్వాసంతో కూడిన జీవితాన్ని గడపడానికి ఏసుక్రీస్తు జీవితం స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రజలందరి మధ్య ప్రేమ, సహనం , కరుణ పాదుకొల్పే ఏసు బోధనలను గౌరవించడానికి క్రిస్మస్ మంచి సందర్భమన్నారు. దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి చెడునుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం , త్యాగాలకు జీసస్ బాటలు వేశారని పేర్కొన్నారు. కరుణ, ప్రేమ, సహనం, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు