Oct 09,2023 19:39

కమెడియన్‌ వెన్నెల కిషోర్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తున్న తాజా చిత్రం 'చారి 111'. టీజీ కీర్తికుమార్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకున్నట్లు మేకర్స్‌ సోషల్‌ మీడియాలో వెల్లడించారు. కాస్ట్‌ అండ్‌ క్రూతో ఉన్న వీడియోను షేర్‌ చేశారు. ఈ సినిమాలో రహస్య గూఢచారి పాత్రలో వెన్నెల కిషోర్‌ కనిపించనున్నారు. సీనియర్‌ నటుడు మురళి శర్మ కీలక పాత్ర పోషిస్తున్నారు. సంయుక్త విశ్వనాథన్‌ హీరోయిన్‌గా నటించారు. సిమన్‌ కే కింగ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను బర్కత్‌ స్టూడియెస్‌ బ్యానర్‌పై అదితి సోని నిర్మిస్తోంది.