Aug 04,2023 17:46

న్యూఢిల్లీ : జూలై 14న శ్రీహరికోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్‌ 3 విజయవంతమయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయని ఇస్రో శుక్రవారం ట్వీట్‌ చేసింది. ఇస్రో పంపిన వ్యోమనౌక చంద్రునికి మూడింట రెండు వంతుల దూరాన్ని కవర్‌ చేసిందని, లూనార్‌ ఆర్బిట్‌ ఇంజెక్షన్‌ (ఎల్‌ఓఐ) ఆగస్టు 5కి సెట్‌ చేయడం జరిగిందని.. కేవలం 19 గంటల్లో ఇది చంద్రుని కక్ష్యను చేరుకోనుందని ఇస్రో ట్వీట్‌ తెలిపింది. ఈ ప్రయోగంతో.. అమెరికా, చైనా, రష్యా దేశాల తర్వాత ఇలాంటి ప్రయోగం చేసిన నాల్గవ దేశంగా భారత్‌ నిలవనుంది.