Sep 23,2023 19:59

రాఘవ లారెన్స్‌, కంగనా రనౌత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'చంద్రముఖి 2'. పి.వాసు ఈ సినిమాను తెరకెక్కించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా దీని సెన్సార్‌ పనులు పూర్తయ్యాయి. ఈ మేరకు నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. 2.37 గంటలపాటు సినిమా నిడివి ఉంటుందని నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ ట్వీట్‌ చేసింది. ఆదివారం ఈ చిత్రం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ హైదరాబాద్‌లో జరగనున్నట్లు తెలిపింది.