Aug 24,2022 12:17

నల్లమాడ (అనంతపురం) : స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద మండల సిపిఎం కార్యదర్శి గోవిందు, పంచాయతీ పారిశుధ్య కార్మికులు, స్వచ్ఛ భారత్‌ కార్మికులతో కలిసి చలో కలెక్టరేట్‌ పోస్టర్లను బుధవారం విడుదల చేశారు. దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని కార్మికుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈనెల 26న సత్యసాయి జిల్లా కలెక్టరేట్‌ వద్ద సిఐటియు ఆధ్వర్యంలో చలో కలెక్టరేట్‌ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ సంబంధిత కరపత్రాలను సిపిఎం కార్యదర్శి గోవిందు విడుదల చేశారు.