డోన్ (కర్నూల్) : దాదాపు రూ.1.3 కోట్ల విలువైన సెల్‌ఫోన్ కంటైనర్‌ను ఇద్దరు డ్రైవర్లు చోరీ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ భారీ చోరీ ఈ నెల 11న కర్నూలులో జరిగింది. దాదాపు రూ.1.3 కోట్ల విలువైన సెల్‌ఫోన్‌ల లోడుతో హర్యానా నుంచి బెంగళూరుకు వెళుతున్న కంటైనర్‌ను కర్నూల్ జిల్లా డోన్ జాతీయ రహదారిలోని ఓబులాపురం మిట్ట సమీపంలో రోడ్డు పక్కనే ఆపిన ఇద్దరు డ్రైవర్లు ... ఆ కంటెయినర్‌లోని సెల్‌ఫోన్లన్నిటినీ వేరొక వాహనంలోకి మార్చేసి.. కంటైనర్‌ను అక్కడే వదిలి పరారయ్యారు. విషయం తెలిసిన నాగాలాండ్‌కు చెందిన కంటైనర్ యజమాని.. వెంటనే డోన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దొంగలను పట్టుకునేందుకు హర్యానాకు ప్రత్యేక బృందాన్ని పంపారు. ఘటనపై కేసు నమోదు చేసి డోన్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.