మదీనాగూడ: భాగ్యనగరంలో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. వినాయక చవితి మండపాలే టార్గెట్గా చోరీలకు పాల్పడుతున్నారు. పోలీసులు ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా దొంగలు మాత్రం చోరీలను ఆపడం లేదు. ఇప్పటికే మౌలాలిలో గణపతి లడ్డూను దొంగలు ఎత్తుకెళ్లగా.. తాజాగా మియాపూర్ పరిధిలోని మదీనాగూడలో ఇదే ఘటన చోటుచేసుకుంది. జాతీయ రహదారి పక్కన ఓంకార సేవా సమితి ఏర్పాటు చేసిన భారీ గణనాథుడి చేతిలో ఉన్న 11 కేజీల లడ్డూను దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ దఅశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.