పలాస కాశీబుగ్గ (శ్రీకాకుళం) : పలాస కాశీబుగ్గ జంట పట్టణాల్లో జీడి పంటకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ ... పలాస ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి శ్రీనివాస్ లాడ్జి మీదుగా కాశీబుగ్గ బస్టాండ్ మూడు రోడ్ల జంక్షన్ వరకు జిల్లా జీడి రైతుల సంఘం ఆధ్వర్యంలో జీడి రైతులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.మోహన్ రావు, జిల్లా జీడి రైతుల సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజరు కుమార్, ఎన్.గణపతి, చాపర వెంకటరమణ, మద్దిల రామారావు, రైతులు, తదితరులు పాల్గొన్నారు










