Sep 27,2023 19:58

'లియో ఆడియో ఫంక్షన్‌కి విజయ్ అభిమానులు చాలామంది వచ్చే అవకాశం వుంది, అందరికీ ఎంట్రీ పాస్‌లు ఇవ్వడం కుదరకపోవచ్చు. ఇంతమంది అభిమానులు రావటం వలన, భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ రద్దు చెయ్యాలని అనుకున్నాం' అని చిత్ర నిర్మాతలు తాజాగా ట్వీట్‌ చేశారు. సెప్టెంబరు 30న ఆడియో ఫంక్షన్‌ జరగాల్సి ఉంది. లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌ రద్దు వెనక ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదని కూడా ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సినిమా అక్టోబర్‌ 19న విడుదలవుతోంది.