- సిఎం క్యాంపు కార్యాలయం వద్ద భారీ బందోబస్తు
- పలువురి అరెస్ట్
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాత పరీక్ష ఫలితాలకుకనీసం ఐదు మార్కులు కలపాలని డిమాండ్ చేస్తూ కానిస్టేబుల్ అభ్యర్థులు శనివారం నిర్వహించిన సిఎం ఇంటి ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. పెద్ద సంఖ్యలో అభ్యర్థులు వస్తునాురను సమాచారంతో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సిఎం కార్యాలయానికి దారితీసే అన్ని దారులను మూసివేశారు. అటువైపుగా వెళ్లే సిటీ బస్సులనూ అనుమతించలేదు. కానిస్టేబుల్ అభ్యర్థులతో పాటు, అనుమానం వచ్చిన పలువురిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో అటు విజయవాడ, గుంటూరుల నుండి తాడేపల్లి పరిసర ప్రాంతాలకు వచ్చే సాధారణ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మరోవైపు రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల నుండి సుమారు 400 మంది అభ్యర్థులు విజయవాడకు వేర్వేరు మార్గాల్లో చేరుకున్నారు. వీరిలో పలువురు తాడేపల్లిలోని టోల్‌గేట్ ప్రాంతానికి చేరుకునాురు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు వారిని తనిఖీలు చేసి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిని తాడేపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు. అరెస్టుల సమయంలో అభ్యర్థులు తమ జీవితాలను కాపాడాలని, పరీక్ష పేపరు గ్రూప్-1 అభ్యర్థులకు ఇచ్చే రీతిలో ఉందని, సామాన్య కానిస్టేబుల్‌కు ఇచ్చే రీతిలో లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తామేమి దౌర్జన్యానికి రాలేదని, తమ బాధను సిఎంకు చెప్పుకునేందుకు వచ్చామని అన్నారు. . మరికొందరు విద్యార్థుల్లా నోట్ పుస్తకాలు తీసుకుని అక్కడకురావడంతో పోలీసులు వారిని చుట్టుముట్టారు. బ్యాగులు తనిఖీ చేయించారు. అదుపులోకి తీసుకున్న వారిని సాయంత్రం వరకూ ఉంచి సొంత పూచీకత్తుపై వారిని విడుదల చేశారు. పలువురు కానిస్టేబుల్ అభ్యర్థులు మట్లాడుతూ సంవత్సరాల తరబడి తాము పోలీసు అభ్యర్థులుగా పరీక్షలు రాసేందుకు కష్టపడుతునాుమని తెలిపారు. ఎక్కువమందికి ఇప్పుడు అవకాశం రాకపోతే వయస్సు దాటిపోతుందని మరోసారి అవకాశం ఉండదని తెలిపారు. పోలీసు రిక్రూట్‌మెంటు సమయం ఎక్కువ ఉంటోందని, దానివల్ల ఇక ముందు పరీక్షలు రాసే అవకాశం కోల్పోతామని తెలిపారు. పరీక్ష పేపరు కూడా అత్యంత కఠినంగా ఇచ్చారని, పరీక్షల పేపర్లనూ సంబంధం లేదని అంశాలను ప్రస్తావించారని పేర్కొన్నారు.