ప్రజాశక్తి-(విజయవాడ) : ఎనిమిదేళ్లుగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేటీకరణ, ప్రయివేటీకరణ విధానాలతో ప్రజల బతుకులు అతలాకుతలం అవుతున్నాయి. మరోపక్క ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకు వారి మధ్య మతాల చిచ్చు రాజేసే ప్రయత్నాలను బిజెపి ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో బిజెపి ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు '' దేశ రక్షణ భేరీ '' నినాదంతో సిపిఎం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా సిపిఎం ఎన్‌టిఆర్, కృష్ణా జిల్లాల కమిటీల ఆధ్వర్యంలో ఆయా జిల్లాలో బుధవారం నుండి విస్తృత ప్రచారం ప్రారంభమవుతుంది.
దేశ రక్షణ భేరీ ప్రచారాన్ని జయప్రదం చేయండి : సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్

ప్రజాశక్తి-కడప అర్బన్ : కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీస్తూ రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు సిపిఎం నికరమైన పోరాటం సాగిస్తున్నదని, అందులో భాగంగా నిర్వహించే దేశ రక్షణ భేరి ప్రచారాన్ని జయప్రదం చేయాలని సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్ పిలుపునిచ్చారు. బుధవారం నగరంలోని సిపిఎం కార్యాలయంలో ఈనెల 14 నుంచి 27 వరకు జరిగే దేశ రక్షణ భేరీ పేరుతో ముద్రించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశాన్ని, రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ ఐక్యమై ఉద్యమించటమే మార్గమన్నారు. సిపిఎం దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించే ఆందోళనా ప్రచార కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమ గోదావరి) : కేంద్రంలో బిజెపి ప్రభుత్వం దేశ ప్రజలపై విపరీతమైన భారాలు మోపుతోందని, వీటిని తిప్పికొట్టేందుకు సిపిఎం ఆధ్వర్యంలో దేశ పరిరక్షణ భేరి యాత్రలు నిర్వహిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కేతాగోపాలన్ అన్నారు. బుధవారం ఉదయం సిపిఎం ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టిన ప్రచార యాత్రను గోపాలన్ జెండా ఊపి ప్రారంభించారు.
కరపత్రాల విడుదల

ప్రజాశక్తి పుట్లూరు(అనంపురం) : బిజెపి ప్రభుత్వం వ్యవహరింస్తున ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ సిపిఎం కేంద్ర కమిటీ పిలుపు మేరకు సిపిఎం ఆధ్వర్యంలో ఈనెల 14 నుంచి 28 వరకు జరిగే ప్రచార క్యాంపెయిన్ , కార్యక్రమం బుధవారం కడవకల్లు గ్రామంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ 8 సంవత్సరాల బిజెపి మోడీ పాలనలో దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు చుక్కలనంటాయన్నారు. అన్ని వస్తువుల పైన జీఎస్టీ పేరుతో ప్రజలపై భారం మోపారని, వంటగ్యాస్ సిలిండర్ ధర 1100 దాటిందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, ఎల్‌ఐసి , బ్యాంకులు, బిఎస్‌ఎన్‌ఎల్‌తో సహా అన్నిటీని ప్రైవేటీకరించి కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు యస్.సూరి, కార్యదర్శి ఎమ్.కృష్ణ మూర్తి, సిపిఎం మండల కార్యదర్శి వి.టి.రామాంజినేయులు, సిపిఎం మండల కమిటీ నాయకులు జి.వెంకటచౌధరి, టి.బాలగుర్రయ్య, బి.భాస్కర్ రెడ్డి, టి.నాగమునేంద్ర, గ్రామస్తులు అదెప్ప, నల్లయ్య, రఘువీరా, తదితరులు పాల్గొన్నారు.

నెల్లూరు : నెల్లూరులోని వెంకటేశ్వరాపురంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిపిఎం దేశ రక్షణ భేరీ ప్రచారం బుధవారం ప్రారంభమయ్యింది. నెల్లూరు రూరల్ : నెల్లూరు రూరల్ 30వ డివిజన్ వైఎస్‌ఆర్ నగర్ చంద్రబాబునగర్ రామచంద్రారెడ్డి నగర్ కొత్తూరు సిపిఎం శాఖల ఆధ్వర్యంలో సిపిఎం'' దేశ రక్షణ బేరి''జాత జయప్రదం చేయాలని కోరుతూ ... బుధవారం సిపిఎం నాయకులు కరపత్రాలను పంపిణీ చేశారు.

పశ్చిమ గోదావరి : యలమంచిలి మండలం ఏనుగువానిలంక గ్రామంలో జోరు వర్షం కురుస్తున్నప్పటికీ సిపిఎం ఆధ్వర్యంలో దేశ పరిరక్షణ భేరీ యాత్రలు ప్రారంభమయ్యాయి.

విశాఖ : కేంద్ర ప్రభుత్వ (బిజెపి) దుర్మార్గ విధానాలపై దేశవ్యాప్తంగా జరిగే ప్రచార-ఆందోళనలో భాగస్వాములు కండి.. అంటూ అరకు పంచాయతీ అరకు సంతలో ప్రచార యాత్ర బుధవారం ప్రారంభమైంది. డుంబ్రిగుడ మండల సిపిఎం మండల కార్యదర్శి ఎస్బీ పోతురాజు ఆధ్వర్యంలో యాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు పాంగి. సురేష్ కుమార్, పాంగి. సత్యనారాయణ పాల్గొన్నారు.

విశాఖ : బిజెపి ప్రభుత్వ విధానాలపై పోరాటానికి సన్నద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు జి.కోటేశ్వరరావు పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి తీరం ద్రోహం చేసిందని, విభజన హామీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జి.కోటేశ్వరరావు విమర్శించారు. బుధవారం తిమ్మరాజుపేటలో బిజెపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచార కార్యక్రమంలోపాల్గని ప్రసంగించారు.

జోరు వానలో.. సిపిఎం దేశ పరిరక్షణ యాత్ర
ప్రజాశక్తి-బియలమంచిలి (పశ్చిమ గోదావరి) : జోరువానలో... బియలమంచిలి మండలంలోని ఏనుగువానిలంక గ్రామంలో బుధవారం సిపిఎం ఆధ్వర్యంలో దేశ పరిరక్షణ యాత్రలు ప్రారంభమయ్యాయి. ఈ యాత్రను సిపిఎం సీనియర్ నాయకులు మాస వరపు సుబ్బారావు జెండాను ఊపి ప్రారంభించారు. ఏనుగువానిలంక నుండి బాడవ, కలగంపూడి, కాజా పడమర, కాజా తూర్పు, ఊటాడ గ్రామాల మీదుగా సాయంత్రం 6 గంటల వరకు యాత్ర సాగనుంది. ఈ యాత్రను ఉద్దేశించి సిపిఎం మండల కార్యదర్శి కానేటి బాలరాజు, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు బాతి రెడ్డి జార్జిలు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నాయకులు దేవ సుధాకర్, పొన్నపల్లి రామకఅష్ణ, కోడెల్లి మందులు, గూడూరి ఆంజనేయులు, గుబ్బల సత్యనారాయణ, గూడూరి వెంకటేశ్వర్లు, వినుకొండ సత్యనారాయణ, గోడి కుమార రత్నం, తదితరులు పాల్గొన్నారు.

యనమలకుదురులో ప్రచార జాతా ప్రారంభం

యనమలకుదురు(కృష్ణా ): బిజెపి ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు 'దేశ రక్షణ భేరీ' నినాదంతో సిపిఎం దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురులో ప్రచార జాతాను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు ప్రారభించారు. ఈకార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు ఆర్ రఘు, తదితరులు పాల్గొన్నారు.










