మంగళగిరి రూరల్ (గుంటూరు) : మండలంలోని నిడమర్రు గ్రామానికి చెందిన సిపిఎం కార్యకర్త కట్టిపోగు పానకాలు (83) శుక్రవారం రాత్రి మృతి చెందారు. పానకాలుకు ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. 1995 పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా పానకాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భౌతికయంపై సిపిఎం నాయకులు శనివారం పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని కమిటీ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం.భాగ్యరాజు, సిపిఎం గ్రామ కార్యదర్శులు కే.వెంకటేశ్వర్లు, గైర్బోయిన నాగేశ్వరావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు కట్టిపోగు ప్రకాశరావు, రైతు సంఘం నాయకులు కే.నాగేశ్వరావు, సిపిఎం నాయకులు కే.బుల్లబ్బాయి, ఎం కోటేశ్వరరావు పాల్గొన్నారు.










