Mar 02,2023 14:57

ప్రజాశక్తి - రేపల్లె (బాపట్ల) : పేదలుపై బారంపడేలా పెంచినా గ్యాస్‌ ధరలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ రేపల్లె నెహ్రూ బొమ్మ వద్ద సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్‌ మణిలాల్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నిత్యావసరధరలు తగ్గిస్తామని హామీలు ఇచ్చి ఇప్పుడు రోజువారి పేదలు తిండితినే వాటికి సంబంధించినా గ్యాస్‌ ధర పెంపుదల చేస్తు పేదప్రజల పొట్టగొట్టి కార్పొరేట్‌ అంబానీ,అధా నిలకు దొచిపెడుతునారని విమర్శించారు. మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలకు కానుకగా ప్రధాని మోడీ గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెంచారన్నారు. రాష్ట్రాల్లో ఎన్నికలు అయిపోగానే గ్యాస్‌ ధరలు పెంచడం కేంద్రానికి ఆనవాయితీగా మారిందన్నారు. బిజెపి అధికారంలోకి రాకముందు రూ.400 ఉన్న గ్యాస్‌ ధర ఇపుడు సుమారు రూ.1200కు చేరిందని తెలిపారు. వంటగ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతుండటంతో సామాన్యు లు దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు పై భారాలు వేస్తున్నా బిజెపి విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు గట్టిగా మాట్లాడకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రేపల్లె వై.కిషోర్‌ బాబు,జి.దానియేలు డి.బాబురావు, డి.శ్రీనివాసరావు, ఎల్‌.వెంకట్‌, ఏం.సూర్యప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.