వి ఆర్ పురం (అల్లూరి) : మండలంలోని రాకపల్లి పంచాయతీలో ఉన్న ఉమ్మడివరం గ్రామంలో ఆదివారం సిపిఎం ప్రచార భేరి చేపట్టింది. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనం.సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ ప్రచార భేరిలో భాగంగా ప్రతి ఇంటికి కరపత్రాలు పంచుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ర్యాలీగా సాగారు. పార్టీ జిల్లా కమిటీ సభ్యులు పూనేం సత్యనారాయణ మాట్లాడుతూ ... ముమ్మిడివరం గ్రామంలో ఉపాధి హామీ పనులకు సంబంధించి గడ్డ పలుగు లు ఇవ్వాలని, పనిచేసే ప్రదేశం వద్ద మంచినీళ్లకు ఒక మనిషిని కేటాయించాలని, టెంట్లు ఏర్పాటు చేయాలని, సమ్మర్ బోనస్ కలపాలని, ఉమ్మిడివరం గ్రామాన్ని 41,5 కాంటురులో చేర్చాలని, గ్రామంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆగడాలను అరికట్టాలని, బోయ వాల్మీకీలను ఎస్‌టి జాబితాలో చేర్చవద్దు అని పొడు భూములు పట్టాలు ఇవ్వాలి అని డిమాండు చేశారు. ప్రజలు ప్రచార భేరి బఅందానికి బ్రహ్మరథం పట్టారు. ఈ కార్యక్రమంలో శాఖ సెక్రెటరీ కురసం నాగేశ్వరావు, చిక్కాల, తదితరులు పాల్గొన్నారు.










