Sep 21,2022 11:04

పెనుమంట్ర (పశ్చిమ గోదావరి) : విజయవాడలో ఈనెల 25వ తేదీన జరిగే మహా ప్రదర్శన, బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని సిపిఎం నేతలు పిలుపునిచ్చారు. బుధవారం పెనుమంట్ర మండలం పెనుమంట్రలో ప్రారంభమైన దేశ రక్షణ భేరి యాత్రను సిపిఎం జిల్లా నాయకులు ఆకుల హరే రామ్‌ ప్రారంభించారు. భట్లమగుటూరు, ఆలమూరు, ఓడూరు, నెలమూరు, సత్యవరం మీదుగా వెలగలేరు, మార్టేరుతో యాత్ర ముగుస్తుందని తెలిపారు.