ఈనెల 20న పోలవరం నిర్వాసితుల న్యాయం కోసం సిపిఎం మహా పాదయాత్ర
వి ఆర్ పురం (అల్లూరి) : వి ఆర్ పురం మండలం రేకపల్లి నుండి ముంపు మండలాల మీదుగా విజయవాడ వరకు జూన్ 20న పాదయాత్ర ప్రారంభం అవుతుందని, నిర్వాసిత కుంటుంబం నుండి ఇంటికొక్కరు పాదయాత్రలో పాల్గొనాలని సిపిఎం నేతలు పిలుపునిచ్చారు.
శుక్రవారం సిపిఎం మండల కార్యదర్శి సోయం చిన్నబాబు మాట్లాడుతూ ... జూన్ 2 న పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగే వరకు సిపిఎం పోరాడుతుందని, అందులో భాగంగా జూన్ 20న ముంపు మండలాల నుండి విజయవాడ వరకు సిపిఎం ఆధ్వర్యంలో మహా పాదయాత్ర చేపడుతుందని అన్నారు. మండలో గ్రామ విస్తృత స్థాయి సమావేశం జీడిగుప్ప కోటార్ గోమ్ము ముల్కనపల్లి గ్రామాల్లో జరిగిందన్నారు. ముందు పరిహారమిచ్చిన గ్రామాల్లో ఇంకా కొంతమంది లబ్దిదారులకు ఆర్ అండ్ ఆర్ పరిహారం తీసుకోకుండానే చనిపోయినవారున్నారు అని, ఆ కుటుంబ సభ్యులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది కానీ అధికారులు వీరికి పంగనామం పెట్టాలని చూస్తున్నారని అన్నారు. 18 సంవత్సరాల నిండిన అందరికీ ఆర్ అండ్ ఆర్ ద్వారా గ్రామాల్లో 2017 సంవత్సరంలో కటాఫ్ డేటుగా ప్రకటించటం వల్ల గ్రామాల్లో యువత చాలామంది ఇబ్బంది పడే పరిస్థితి ఉందని అన్నారు. పోలవరం గ్రామాలను ఖాళీ చేసే రోజుకి కట్ ఆఫ్ డేట్ గా ప్రకటించి గ్రామాలు యువత యువకులకు అందరికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు. కుంజ. నాగిరెడ్డి వడ్లాది. రమేష్ శాఖ కార్యదర్శిలు శాఖ సభ్యులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.










