తిరువూరు (ఎన్‌టిఆర్) : సిఎం జగన్ తిరువూరు పర్యటన నేపథ్యంలో ... గిరిజన సంఘం రాష్ట్ర నేత బి.గోపిరాజును శనివారం అర్ధరాత్రి పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలపై సిఎంకు విన్నవిస్తారని, ఏ.కొండూరు మండలంలోని గిరిజనులు, దళితులు, బీసీల వర్గాల కిడ్నీ బాధితుల కష్టాలు పరిష్కారం చేయాలని సభలో సిఎంను అడుగుతారని ముందుగానే పోలీసులు గిరిజన సంఘం నేతను హౌస్ చేశారు.










