Dec 25,2022 12:34

ప్రజాశక్తి-పులివెందుల టౌన్‌: క్రిస్మస్‌ పండగ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పులివెందుల సీఎస్‌ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్నారు. ఇడుపులపాయల నుంచి హెలికాప్టర్‌లో పులివెందుల చేరుకున్న సీఎం జగన్‌ సీఎస్‌ఐ చర్చికి వెళ్లి క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్నారు. తల్లి విజయమ్మతో పాటు భార్య భారతి కుటుంబ సభ్యులు ఎంపీ అవినాష్‌ రెడ్డి, భాస్కర్‌ రెడ్డి కొందరు స్థానికుల సమక్షంలో క్రిస్మస్‌ ప్రార్థనలో జగన్‌ పాల్గొన్నారు. అనంతరం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. క్రిస్మస్‌ వేడుకల అనంతరం సీఎం జగన్‌ పులివెందుల నుంచి బయలుదేరి కడప విమానాశ్రయం చేరుకున్నారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా విజయవంతం కావడంతో కడప పార్లమెంటు సభ్యులు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి , జిల్లా కలెక్టర్‌ విజయరామరాజు, జిల్లా ఎస్పీ అన్బురాజన్‌ ముఖ్యమంత్రి పర్యటనలో విధులు నిర్వహించిన అధికారులకు, పోలీసులకు, ప్రజా ప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు.