Jul 30,2023 10:01

ప్రజాశక్తి-అమరావతి : ఇస్రో చేపట్టిన పీఎస్‌ఎల్వీ సీ-56 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. ఈ సందర్భంగా రాకెట్‌ విజయవంతమైన నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తలకు సిఎం జగన్‌ అభినందనలు తెలిపారు. ఏడు ఉపగ్రహాలతో విజయవంతంగా రాకెట్‌ను ప్రయోగించిన ఇస్రో బృందానికి శుభాకాంక్షలు చెప్పారు. అలాగే, భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సొంతం చేసుకోవాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు.