Aug 08,2023 13:13

కోల్‌కతా : డెబ్బయితొమ్మిదేళ్ల మార్క్సిస్టు నేత, పశ్చిమ బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్‌ భట్టాచార్య ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ఒకటి రెండు రోజుల్లో ఆయనను డిశ్చార్జి చేసే విషయం గురించి వైద్యులు ఆలోచిస్తున్నట్టు ఆసుపత్రి అధికారులు తెలిపారు. బుద్ధ దేవ్‌ తీవ్ర అస్వస్థతకు గురవడంతో ఇటీవల ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కంటిన్యూగా కాకుండా అప్పుడప్పుడు నాన్‌ ఇన్వాసివ్‌ వెంటిలేటరీ సపోర్టు తీసుకుంటున్నారని, ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిందని వారు తెలిపారు.