Oct 10,2023 17:26

రోషన్‌ కనకాల కొత్త చిత్రం 'బబుల్‌గమ్‌' నుండి మంగళవారం టీజర్‌ విడుదలైంది. రవికాంత్‌ పేరెపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, మహేశ్వరి మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మానస చౌదరి కథానాయిక. టీజర్‌ లాంచ్‌ కార్యక్రమానికి నాని ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. 'రోషన్‌ తొలి సినిమాకే చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నాడు. టీజర్‌ చూసినప్పుడు చాలా అద్భుతంగా చేశాడనే ఫీలింగ్‌ వచ్చింది. రోషన్‌కి ఆల్‌ ది వెరీ బెస్ట్‌. మరో సక్సెస్‌ ఫుల్‌ హీరో తెలుగు ఇండిస్టీ వచ్చాడని కాన్ఫిడెంట్‌గా చెప్పగలను. టీం అందరికీ ఆల్‌ ది బెస్ట్‌. డిసెంబర్‌ 29న విడుదల చేస్తున్నారు. గ్రేట్‌ డేట్‌ ఇది. న్యూ ఇయర్‌, న్యూ వేవ్‌ రాబోతుంది ఇండిస్టీలోకి. ఆ రోజు బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ని సెలబ్రేట్‌ చేసుకుందాం' అని నాని ఈ కార్యక్రమంలో మాట్లాడారు.