Oct 05,2023 20:40

హీరో ఆనంద్‌ దేవరకొండ 'గం..గం..గణేశా' సినిమాలో నటిస్తున్నారు. హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మిస్తున్నారు. ఉదరు బొమ్మిశెట్టి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా నుంచి 'బృందావనివే..' లిరికల్‌ సాంగ్‌ను హీరోయిన్‌ రశ్మిక మందన్న గురువారం విడుదల చేశారు. 'బేబి' సినిమాలోని 'ప్రేమిస్తున్నా' పాటను గతంలో రశ్మికనే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సాంగ్‌ బిగ్‌ హిట్‌ కావాలని ఆమె ఆకాంక్షించారు. చేతన్‌ భరద్వాజ్‌ కంపోజ్‌ చేసిన ఈ పాటకు వెంగి సుధాకర్‌ సాహిత్యం అందించారు. సిధ్‌ శ్రీరామ్‌తో కలిసి చేతన్‌ భరద్వాజ్‌ ఈ పాట పాడారు.