- త్వరలో ఫేస్‌బుక్‌లోనూ ఛార్జీలు
- ఎలాన్ మస్క్ బాటలోనే జుకర్‌బర్గ్
న్యూయార్క్ : ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్‌లో బ్లూ బ్యాడ్జ్‌ను అందించేందుకు ప్రీమియం వెరిఫికేషన్ పద్ధతి అమలు చేయాలని వాటి మాతృసంస్థ మెటా నిర్ణయించింది. ట్విట్టర్ బ్లూ' పేరుతో పెయిడ్ వెరిఫికేషన్‌ను ట్విట్టర్ ఇటీవల అందుబాటులోకి తెచ్చిన నేపథ్యంలో మెటా ఈ నిర్ణయం తీసుకుంది. సబ్‌స్క్రిప్షన్ వెబ్‌లో నెలకు 11.99 డాలర్లుగా ప్రారంభమై, ఐఒఎస్ ప్లాట్ పారమ్‌లలో 14.99 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ సేవలను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లో తొలుత ఈ వారం ప్రవేశపెడతారు. చెల్లింపు వినియోగదారులు తమ ప్రొఫైల్‌ను ప్రభుత్వ ఐడితో ధ్రువీకరించవచ్చు. ప్రొఫైల్ వెరిఫికేషన్‌తో పాటు, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ కోసం సబ్‌స్క్రిప్షన్, అదనపు రక్షణను కూడా అందిస్తుంది.'ట్విట్టర్ బ్లూ' పేరుతో పెయిడ్ వెరిఫికేషన్‌ను ట్విట్టర్ అందుబాటులోకి తెచ్చింది. భారతీయ వినియోగదారుల కోసం వెబ్‌సైట్, మొబైల్‌లో వరుసగా రూ.650, రూ.900 చొప్పున చెల్లింపు సేవలు అందిస్తోంది. ట్విట్టర్ బ్లూ యూజర్లకు ఇతర యూజర్ల కంటే కొన్ని అదనపు ఫీచర్లను కల్పించింది.










