Oct 07,2023 19:51

'దొరసాని' చిత్రం తెరకెక్కించిన కేవీఆర్‌ మహేంద్ర తాజా ప్రాజెక్టు 'భరతనాట్యం'. 'ఈజ్‌ ది మోస్ట్‌ బ్యూటీఫుల్‌ ఫ్రాడ్‌ ఇన్‌ ది వరల్డ్‌' అనేది ఉపశీర్షిక. 'పోకిరి', 'అర్జున్‌ రెడ్డి', 'కేజీఎఫ్‌' వంటి చిత్రాలకు టైటిల్‌ పోస్టర్‌ డిజైన్‌ చేసిన సీనియర్‌ గ్రాఫిక్‌ డిజైనర్‌ ధని ఏలే తనయుడు సూర్య తేజ ఏలే ఈ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అవ్వబోతున్నాడు. మీనాక్షి గోస్వామి కథానాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుండి టీజర్‌ విడుదలచేశారు. సినిమాలంటే పిచ్చి ఉన్న ఓ యువకుడు దర్శకుడు కావాలనుకొనే కథ ఇదని టీజర్‌ చూస్తే తెలుస్తోంది. క్రైమ్‌ కామెడీ జానర్‌లో రానున్న ఈ సినిమాలో వైవా హర్ష, హర్షవర్ధన్‌, అజయ్ ఘోష్‌, సలీం ఫేకు, గంగవ్వ, కృష్ణుడు, టెంపర్‌ వంశీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వివేక్‌ సాగర్‌ సంగీతం అందిస్తున్నారు.