
జీవవైవిధ్యానికి
చోటునిచ్చి
ఈత కొట్టడానికి
బాల్య స్మృతులనిచ్చి
కరువు ఏర్పడితే
నీటినిచ్చి
భూగర్భ జలాలకి
ఊతమిచ్చి
భావి తరాలకు
అనగనగా ఒక బావి
అనే కథలనిచ్చి
నాటి సంస్మృతులకు
ప్రతీకగా నిలిచిన
ఓ బావీ ..
నేడు నీ జాడెక్కడ ?
-కయ్యూరు బాలసుబ్రమణ్యం
సెల్: 7780277240