Sep 24,2022 16:44

విజయవాడ : రాష్ట్రంలో మోడీ రాజ్యం నడుస్తోందని.. కేంద్రంలో బిజెపి అదేశాలు ఇక్కడ జగన్‌ అమలు చేస్తున్నారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. శనివారం విజయవాడలో జరిగిన 'దేశ రక్షణ బేరి' బహిరంగ సభలో వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ''రాష్ట్రంలో ఒక అడ్డగోలు ప్రభుత్వం నడుస్తుంది. చెత్త పన్ను వేస్తే ప్రజలు ప్రభుత్వాన్ని చెత్త బుట్టలో వేస్తారు. డబ్బు లేకపోతే మోదీ జుట్టు పట్టుకుని రూ.36 వేల కోట్లు తీసుకురండి. వైసిపికి పార్లమెంట్లో సంఖ్య బలం వున్న కేంద్రాన్ని ప్రశ్నించలేకపోతున్నారన్నారు. విశాఖ ఉక్కు అమ్మకానికి సిద్ధం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌ అధానిప్రదేశ్‌గా మార్చుతున్నారు. కౌలు రైతులను ప్రభుత్వం గాలికొదిలేసింది. ఈ రెండు సంవత్సరాల్లో అయిన జగన్‌ ప్రభుత్వంలో మార్పు రాకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు. కమ్యూనిస్ట్‌ల కాలం చెల్లింది అనే వారి కాలం చెల్లుతుంది. దేశంలో కేరళ మాత్రమే రైతులకు న్యాయం చేస్తుంది. వికేంద్రీకరణ అనేది కేరళ వెళ్ళి నేర్చుకోండి'' అని శ్రీనివాసరావు అన్నారు.