ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులను నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్‌కుమార్‌మీనా గెజిట్ నోటిఫికేషన్ బుధవారం విడుదల చేశారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్‌కుమార్ ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాలకు ఆర్‌ఒలను నియమించారు. గెజిట్ నోటిఫికేషన్ జారీతో రానున్న సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో తొలి అంకం ప్రారంభమైనట్లే.










