Nov 06,2023 10:50

పదివేలకు చేరిన గాజా మృతుల సంఖ్య
అబ్బాస్‌తో బ్లింకెన్‌ భేటీ
గాజా సిటీ : 
గాజాలోని జబాలియా శరణార్ధి శిబిరంపై ఇజ్రాయిల్‌ మరోసారి దాడి చేసింది. బురేజ్‌ శరణార్థి శిబిరంపై దాడి తరువాత జబాలియాపై విరుచుకుపడింది. ఈ దాడిలో 20 మంది చని పోగా, అనేకమంది గాయపడ్డారు. గత నెల రోజుల్లో ఇజ్రాయిల్‌ రాక్షనత్వానికి 10వేల మంది పాలస్తీనా పౌరులు మరణించారు. ఒకవైపు ఈ మారణకాండకు ఇజ్రాయిల్‌ను ఎగదోస్తూ, మరోవైపు పాలస్తీనా అధ్యక్షుడు మహ్మద్‌ అబ్బాస్‌తో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్‌ సమావేశమయ్యారు. పాలస్తీనా సమస్యకు సమగ్ర పరిష్కారం చూపితే, గాజాలోను పాలస్తీనా అథారిటీ అధికారంలోకి తిరిగి రాగలదని అబ్బాస్‌ బ్లింకెన్‌తో అన్నట్లు రాయిటర్‌ వార్తా సంస్థ తెలిపింది. గాజా సంధి కుదుర్చుకోవాలని అరబ్‌ నాయకులతో కలసి అబ్బాస్‌ అమెరికాను కోరినట్లు తెలిసింది.
 

ఇజ్రాయెల్‌ మంత్రి తొలగింపు
గాజా స్ట్రిప్‌పై అణుబాంబు వేసే అంశాన్ని ఇజ్రాయెల్‌ పరిశీలిస్తుందని మంత్రి అమిహై ఎలి యహు చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనను నెత న్యాహు తన మంత్రివర్గం నుంచి సస్పెండ్‌ చేశారు