టాలీవుడ్ యంగ్ సందీప్ రెడ్డి వంగా నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'యానిమల్'. ఈ మూవీలో రణ్ బీర్ కపూర్, రష్మిక కలిసి జంటగా నటిస్తున్నారు. నాకు తండ్రి కావాలని ఉంది అని హీరో అంటే.. మీ తండ్రిలాగా అయితే ఉండవు కదా అంటూ హీరోయిన్ చెప్పిన డైలాగ్‌తో టీజర్ మొదలైంది. వయసుకొచ్చిన కొడుకును కొడుతూ.. క్రిమినల్‌ను కన్నాం మనం అంటూ తండ్రి పాత్రలో అనిల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయినా మా నాన్న ఈ ప్రపంచంలోనే బెస్ట్ అంటూ రణబీర్.. రష్మికతో చెప్పడం.. ధనవంతుల కుటుంబంలో పుట్టి చాలా సాఫ్ట్‌గా ఉన్న అతను క్రూరంగా మారి రక్తపాతం సృష్టించిన తీరును టీజర్‌లో చూపెట్టారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ యాక్షన్ సీన్లను మరింత రక్తికట్టించేలా ఉంది. బాబీ డియోల్ విలన్ పాత్రలో కనిపించారు. భద్రకాళి పిక్చర్స్, టీ సిరీస్ బ్యానర్‌పై భూషణ్‌కుమార్, ప్రణరురెడ్డి వంగా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 1న విడుదల కానుంది.










