సుహాస్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ''అంబాజీపేట మ్యారేజి బ్యాండు''. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ''అంబాజీపేట మ్యారేజి బ్యాండు'' సినిమాకు దుశ్యంత్ కటికినేని దర్శకత్వం వహిస్తున్నారు. కామెడీ డ్రామా కథతో తెరకెక్కుతున్న''అంబాజీపేట మ్యారేజి బ్యాండు'' సినిమా త్వరలో థియేటర్స్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా టీజర్‌ను సోమవారం హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు.
యాక్ట్రెస్ శరణ్య ప్రదీప్ మాట్లాడుతూ - ''అంబాజీపేట మ్యారేజి బ్యాండు'' టీజర్ చూడగానే ఒక ట్రాన్స్ లోకి వెళ్లిపోయా. ఈ సినిమా కోసం కష్టపడి వర్క్ చేశాం. మూవీ చేస్తున్న క్రమంలో యూనిట్ అంతా ఒక ఫ్యామిలీలాగ అయిపోయాం. నాకు ఈ మూవీలో క్యారెక్టర్ ఇచ్చి, నేను చేయగలను అని బిలీవ్ చేసిన దర్శకుడు దుశ్యంత్ కు థ్యాంక్స్ చెబుతున్నా. టెక్నికల్ గా అన్ని క్రాఫ్ట్ లలో సినిమా ఆకట్టుకుంటుంది. మూవీ మీ అందరికీ నచ్చేలా బాగుంటుంది. అన్నారు.
డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ - ఈ సినిమా పోస్టర్, టైటిల్ చూసినప్పుడే వీళ్లు ఎంత నేటివ్ గా కథను తెరకెక్కిస్తున్నారో అర్థమైంది. అలాగే టీజర్ చూసి ఇంప్రెస్ అయ్యాను. ఈ సినిమా చూపించమని అడిగితే వాళ్లు చూపించారు. చాలా మెచ్యూర్డ్ రైటింగ్ తో దుశ్యంత్ సినిమాను తెరకెక్కించాడు. చాలా నాచురల్ గా ఉంటూనే ప్రతి సీన్ లో ఒక డ్రామా ఉంటుంది. సుహాస్ యాక్టర్ గా కలర్ ఫొటో లాంటి నేషనల్ అవార్డ్ విన్నింగ్ మూవీ చేశాడు. ఆ తర్వాత అతని సినిమాలన్నీ కంటెంట్ ఉన్నవి ఎంచుకుంటున్నాడు. ఈ మూవీ కూడా పెద్ద హిట్ కావాలి. అన్నారు.
హీరో సుహాస్ మాట్లాడుతూ - ''అంబాజీపేట మ్యారేజి బ్యాండు'' సినిమా ఇంత బాగా రూపుదిద్దుకోవడానికి మా ప్రొడ్యూసర్స్ కారణం. ధీరజ్ గారు మాకు కావాల్సిన సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. అలాగే ఇంత మంచి కథను నా దగ్గరకు తీసుకొచ్చిన దుశ్యంత్ కు థ్యాంక్స్ చెబుతున్నా. లక్ష్మీ క్యారెక్టర్ లో బాగా నటించింది నా కోస్టార్ శివానీ. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, ఎడిటింగ్ ..ఇలా ప్రతి డిపార్ట్ మెంట్ ఔట్ పుట్ సూపర్బ్‌గా ఇచ్చారు. నా డైరెక్టర్స్ నా కెరీర్‌ను ఒక్కో ఇటుక పేర్చి ఇళ్లులా తీర్చిదిద్దారు. మా ఊరిలో గృహప్రవేశం టైమ్‌లో కుంకుమ నీళ్లలో అరచేతిని అద్ది కొత్త ఇంటికి గోడకు అచ్చు వేస్తారు. ఆ అచ్చు అలాగే చిరకాలం ఉండిపోతుంది. నా కెరీర్‌లో అలాంటి అచ్చు లాంటి సినిమా ''అంబాజీపేట మ్యారేజి బ్యాండు''. అన్నారు.










