Jan 06,2023 12:24

ప్రజాశక్తి-కోట (తిరుపతి) : కోట పట్టణ ఆక్రమణల తొలగింపుకు ఎట్టికేలకు మోక్షం లభించింది. డేరింగ్‌ అండ్‌ డైనమిక్‌ అధికారి గా గుర్తింపుపొందిన గూడూరు రెవెన్యూ డివిజనల్‌ అధికారి (ఆర్డీవో) కిరణ్‌ కుమార్‌ కోట పట్టణ అభివఅద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. కోట పట్టణ ప్రజలతో పాటు కోట మండల ప్రజలు పడుతున్న కష్టాలను గుర్తించారు. ఆర్డీవో స్వయంగా వచ్చి కోట రోడ్లను పరిశీలించి చలించి పోయారు. రోడ్లు అభివఅద్ధి చేయాలి అంటే ముందుగా కోట క్రాస్‌ రోడ్డు నుండి కోట కొత్త చెరువు వయా దాదారాయి గుంట వరకు రోడ్లకు ఇరువైపులా ఆక్రమణలు తొలగించాలని, ఆ తరువాత రోడ్లు వేస్తే ప్రజల కష్టాలు తిరుతాయనీ అంచనా వేసి కోట గ్రామ పంచాయితీ కార్యాలయం వద్ద ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. తహశీల్దార్‌ పద్మావతి, ఎంపిడిఓ భవానీ, కోట గ్రామ పంచాయితీ కార్యదర్శి శ్రీనివాసులు ఆధ్వర్యంలో చేపట్టే విధంగా చర్యలు తీసుకొని కార్యక్రమం చేపట్టి ఆక్రమణలు తొలగింపుకు గడువు ఇచ్చారు. ఆ తరువాత కొంతమంది రాజకీయ నాయకులు జోక్యంతో ఆక్రమణల తొలగింపుకు బ్రేక్‌ పడింది. కోట ప్రజలు కాస్త నిరుత్సాహం చెందారు. కానీ డైనమిక్‌ అధికారి ఆర్డీవో కిరణ్‌ కుమార్‌ మాత్రం ఇచ్చిన మాటకు కట్టుపడి రాజకీయ నాయకులను మెప్పించి 2023 నూతన సంవత్సరంలో కోట ప్రజలకు శుభవార్త చెప్పారు. జనవరి 9న సోమవారం నాడు కోట మండల తహశీల్దార్‌ కార్యాలయం వద్ద కోట మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారానికి స్పెషల్‌ గ్రీవెన్స్‌ కార్యక్రమం చేపట్టారు. సోమవారం తహశీల్దార్‌ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుండి గ్రీవెన్స్‌ కార్యక్రమం 2 గంటల వరకు నిర్వహిస్తారు. ఆ కార్యక్రమం పూర్తి అయిన వెంటనే మధ్యాహ్నం 2 గంటల నుండి కోట పట్టణ ఆక్రమణలు తొలగింపు పై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆర్డీవో కిరణ్‌ కుమార్‌ తెలిపారు. గ్రీవెన్స్‌ కార్యక్రమంలో కోట మండలంలో ఉన్న భూ సమస్యల పై అర్జీలు సేకరణ పలు సమస్యలను పరిష్కరించడం జరుగుతుంది. మధ్యాహ్నం జరిగే అఖిలపక్ష సమావేశంకు వ్యాపారస్తులు, అన్నీ పార్టీలకు చెందిన నాయకులు, సంబంధిత అధికారులు హాజరు కావాలనీ ఆర్డీవో కోరారు.