Oct 26,2023 15:25

కామారెడ్డి: కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడిస్తే ఉచిత వైద్యం, విద్య, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని ప్రజాశాంతి వ్యవస్థాపకులు కేఏపాల్‌ అన్నారు. గురువారం సదాశివనగర్‌ మండలం అడ్లుర్‌ ఎల్లారెడ్డి గ్రామంలో మాస్టర్‌ ప్లాన్‌ భూభాదిత రైతులతో కేఏపాల్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏ పార్టీకి ఓటు వేసిన కేసీఆర్‌కే ఓటు వేసినట్లవుతుందన్నారు. కులమతాలకు, రాజాకీయాలకు అతీతంగా రైతులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. రైతులంతా ఏకమై కేసీఆర్‌ను ఓడించాలన్నారు. కేసీఆర్‌ కామారెడ్డిలో రెండు వేల ఎకరాల భూమిని కబ్జా చేయడానికి వస్తున్నారన్నారు. రైతుల కోసం ప్రాణాలని అర్పించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కామారెడ్డిలో కేసీఆర్‌ను ఓడిస్తే ఉచిత వైద్యం, విద్య, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తానని కేఏ పాల్‌ హామీ ఇచ్చారు.